Wednesday, November 6, 2024

రేపు ఛత్తీస్‌గఢ్‌లో ప్రియాంకాగాంధీ పర్యటన

- Advertisement -
- Advertisement -

జగదల్‌పూర్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా జిల్లాలోని జగదల్‌పూర్ నగరంలో గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి బగేల్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలిపారు. ‘ముఖ్యమంత్రి సమ్మాన్ నిధి యోజన’ పథకాన్ని ప్రారంభించే భరోసే కా సమ్మేళన్ కార్యక్రమానికి ప్రియాంకాగాంధీ, సిఎం బగేల్ హాజరవుతారని జిల్లా అధికారులు తెలిపారు.

కాగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పండుగలు, జాతరలు, వారి సంప్రదాయ కార్యక్రమాలు, మత కార్యక్రమాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందజేయనుంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలకు వార్షికంగా (రెండు విడతల్లో ) ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌లోని 1,840గ్రామ పంచాయతీలకు మొదటివిడతగా రూ.5వేల చొప్పున సిఎం అందజేయనున్నారు.

గిరిజనుల, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడమే లక్షంగా ఈ పథకం చేపట్టినట్లు అధికారులు బుధవారం తెలిపారు. 202324ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలు కోసం రూ.5కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News