Wednesday, January 22, 2025

నేడు రాష్ట్రానికి ప్రియాంకగాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఏఐసిసి అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. ఆసిఫాబాద్, ఖాన్‌పూర్‌లలో బహిరంగ సభల్లో ఆమె ప్రసంగించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉండగా, అగ్ర నాయకుల వరుస పర్యటనలతో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులలో జోష్ పెరిగింది. ఇప్పటికే రాహుల్ గాంధీ తుది దశ ఎన్నికల ప్రచారంలో ఒక రౌండ్‌లో భాగంగా వివిధ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రియాంక గాంధీ ఉత్తర తెలంగాణలోని మరికొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఒక రోజుకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత మరోసారి వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ ప్రోటోకాల్ విభాగం పేర్కొంది. ప్రియాంక గాంధీ పర్యటన పూర్తికాగానే ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సిఎంలుగా ఉన్న లీడర్లు తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News