Friday, January 24, 2025

ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు..

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. ఫిబ్రవరి 27వ తేదీ మంగళవారం కాంగ్రెస్ పార్టీ.. చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ సభలో పాల్గొని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మరో రెండు గ్యారంటీలు.. రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే.. కొన్ని కారణాల వల్ల ప్రియాంక గాంధీ పర్యటన రద్ద అయ్యింది. ఈ క్రమంలో ముందుగా నిర్ణయించినట్లుగానే మంగళవారమే రెండు గ్యారంటీలను ప్రారంభించేందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ సభకు రాకపోయినా.. వర్చువల్ గా ఈ గ్యారంటీలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News