Sunday, October 6, 2024

పోలీస్ చారులతగా ప్రియాంక మోహన్

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్ యాక్షన్-అడ్వెంచర్ ‘సరిపోదా శనివారం’లో నేచురల్ స్టార్ నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గ్యాంగ్ లీడర్ తర్వాత నానితో ఆమెకిది రెండో సినిమా. ఆదివారం మేకర్స్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రియాంక మోహన్ చారులత అనే ఇన్నోసెంట్ పోలీసుగా కనిపించింది. ఆమె క్యారెక్టర్‌లో ఫిట్‌గా కనిపిస్తుంది. అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంది.

ఖాకీ దుస్తులు ధరించి, భుజంపై బ్యాగ్‌తో నడుస్తూ కనిపించింది. సినిమాలో ప్రియాంక పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News