Wednesday, January 22, 2025

ప్రియాంకను లోక్‌సభ బరిలో దింపాలి : వాద్రా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన భార్య, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పోటీ చేయాలని వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఆకాంక్షించారు. ఆమె లోక్‌సభలోకి వస్తే ప్రజలు సంతోషిస్తారన్నారు. ప్రియాంక గాంధీని యూపీలోని అమేథి లేదా సుల్తాన్‌పూర్ నుంచి బరిలో నిలపాలని కోరారు. ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన అమేథిలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని బిజెపి నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. ఇక సుల్తాన్‌పూర్ నుంచి కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత మేనకా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News