Sunday, December 22, 2024

కుటుంబ రాజకీయాల గురించి ్రప్రియాంక మాట్లాడటం హాస్యాస్పదం: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు ఎఐసిపి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు లేదని బిరాఎస్ ఎఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత గురువారం వ్యాఖ్యానించారు. బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనేందుకు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరుకు వచ్చిన కవిత విలేకరులతో మాట్లాడుతూ ప్రియాంక గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అద్దాల భవనంలో ఉన్న వారు ఇతరులపై రాళ్లు రువ్వరాదన్న నానుడిని కవిత గుర్తు చేశారు.

ప్రియాంక గాంధీ ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలని కవిత హితవు చెప్పారు. బుధవారం ములుగులో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన ప్రియాంక గాంధీ తెలంగాణలో సాగుతున్న కెసిఆర్ కుటుంబ పాలనపై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ క్యాబినెట్‌లో కెసిఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారని ఆమె విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇస్తూ జవహర్‌లాల్ నెహ్రూ మునివనరాలు, ఇందిరాగాంధీ మనవరాలు, రాజీవ్ గాంధీ కుమార్తె అయిన ప్రియాంక గాంధీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం యావత్ ఎన్నికల ప్రచారంలోనే తాను విన్న పెద్ద జోక్ అంటూ కవిత ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News