Friday, January 24, 2025

ఆర్చరీ విజేలకు బహుమతులు ప్రదానం

- Advertisement -
- Advertisement -

Prizes awarded to archery winners

 

మన తెలంగాణ/హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న తొలి ఎన్‌టిపిసి జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ పోటీలు సోమవారం ముగిసాయి. తెలంగాణ ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. క్రీడల ముగింపోత్సవ కార్యక్రమానికి శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ ప్రమోద్ చందుర్కార్, తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు అనిల్ కామినేని, కార్యదర్శి సంజీవ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాష్ట్ర ఒలింపిక్ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు వేణుగోపాల చారి, కార్యదర్శి జగదీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News