Friday, January 24, 2025

విద్యార్థులకు బహుమతుల అందజేత

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్ : నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని గగ్గలపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహా రావు జయంతి, పిటి ఉష జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పిటి ఉష జన్మదినం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినిలకు తరగతి వారీగా రన్నింగ్ కాంపిటీషన్ నిర్వహించి ప్రథమ, ద్వితీయ స్థానంలో వచ్చిన వారికి మెడల్స్, బహుమతులను అందజేశారు.

అదే విధంగా మాజీ ప్రధాని పివి నరసింహ రావు జయంతిని పురస్కరించుకుని తరగతికి ఒక్కరి చొప్పున బహుబాషా ప్రావీణ్యం ఉన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరి ప్రియ, క్లాస్మేట్ క్లబ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బంధం పరమేశ్వర ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు అనంతరామ శర్మ, పాపిశెట్టి అశోక్, జి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News