Wednesday, January 22, 2025

నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : వివో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9 ప్లే ఆఫ్‌లు, ఫైనల్ ముంబైలో జరుగుతాయని కబడ్డీ లీగ్ నిర్వాహకులు మషల్ స్పోర్ట్ ప్రకటించింది. నేటి నుంచి గచ్చిబౌలి స్టేడియంలో 12 జట్ల మధ్య కబడ్డీ లీగ్ పోటీలు జరగనున్నాయి. డిసెంబర్ 13న ఎలిమినేటర్ 1, 2, సెమీ -ఫైనల్స్ డిసెంబర్ 15న నిర్వహించనున్నారు. గ్రాండ్ ఫైనల్ డిసెంబర్ 17న జరగనున్నది. వివో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9లో భాగంగా నేటి నుంచి హైదరాబాద్‌లో ప్లేఆఫ్స్‌లో చోటు కోసం డిసెంబర్ 10వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పోటీపడ్డనున్నారు.

మషల్ స్పోర్ట్ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ హైదరాబాద్‌లో కబడ్డీ ప్రేమికులకు మూడేళ్ల విరామం తర్వాత స్టేడియంలో వీక్షించనున్నారు. క్రీడలలో ముఖ్యంగా కబడ్డీని ఇష్టపడే నగరం ముంబై అన్నారు. తెలుగు టైటాన్స్ హెడ్ కోచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ నగరవాసులు హైదరాబాద్ జట్టును ప్రోత్సహిస్తారని, వారిముందు ఆడటానికి సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బెంగాల్ వారియర్స్ హెడ్ కోచ్ కె. భాస్కరన్, గుజరాత్ జెయింట్స్ హెడ్ కోచ్ రామ్‌మెహర్‌సింగ్, బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్ రణధీర్‌సింగ్, తెలుగు టైటాన్స్ హెడ్ కోచ్ వెంకటేష్ గౌడ్, పుణే రి పల్టన్ హెడ్ కోచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News