Sunday, January 19, 2025

స్వర్ణ మందిరంలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్: బ్లూస్టార్ ఆపరేషన్ 39వ యానివర్సరీ సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ మందిరంలో భింద్రన్‌వాలే పోస్టర్లు, ఖలిస్థాన్ నినాదాలు చోటుచేసుకున్నాయి. స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ‘బ్లూస్టార్’ అనే మిలిటరీ ఆపరేషన్ జరిగింది. అమృత్‌సర్ స్వర్ణ మందిరం కాంప్లెక్స్‌లో తిష్టవేసిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే తీవ్రవాదులను ఏరిపారేసే మిలిటరీ చర్య జరిగింది. అప్పట్లో వారు ఖలిస్థాన్ ప్రత్యేక దేశం కావాలంటూ భారత్‌పై తిరుగుబాటుకు దిగారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ అనే సైనిక చర్య 1984 జూన్ 1 నుంచి 8 మధ్య జరిగింది. నాడు అమృత్‌సర్ స్వర్ణ మందిరంలో అనేక మంది ప్రాణాలు పోయాయి.
ఖలిస్థాన్‌కు మద్దతుగా సిఖ్ ర్యాడికల్ గ్రూప్ ‘దళ్ ఖాల్సా’ నాటి సంస్మరణ దినోత్సవంగా అమృత్‌సర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాడికల్ సంస్థ ఇచ్చిన ‘అమృత్‌సర్ బంద్’ పిలుపు కారణంగా పంజాబ్‌లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News