Wednesday, January 22, 2025

భారత పతాకానికి అవమానం: ఖలిస్తానీ వేర్పాటువాదుల దుశ్చర్య(షాకింగ్ వీడియో)

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపించిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత జాతీయ జెండాను కొందరు ఖలిస్తానీ మద్దతుదారులు బహిరంగంగా అవమానించిన దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

పలువురు ఖలిస్తానీ మద్దతుదారులు భారతీయ పతాకాన్ని ఫుట్‌బాల్‌కు చుట్టి కాళ్లతో తన్నుతూ భారత పతాకాన్ని అవమానిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. టోరంటోలో ఆందోళనకారులు భారతీయ పతాకాన్ని తగలబెట్టడం, ప్రధాని నరేంద్ర మోడీ కటౌట్లపై చెప్పులు విసిరేయడం వంటి దృశ్యాలు కూడా వీడియోలో కనిపించాయి.

భారతీయ జెండాను అవమానించడం విదేశాలలో ఇది మొదటిసారి కాదు. వాంకోవర్, అట్టావా, టోరంటోలోని భారతీయ దౌత్య కార్యాలయాల వెలుపల నిరసన తెలియచేస్తున్న సందర్భంగా ఖలిస్తానీ మద్దతుదారులు త్రివర్ణ పతాకాన్ని అవమానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News