Thursday, January 23, 2025

ఇరుకు రోడ్డుతో ఇబ్బందులు..

- Advertisement -
- Advertisement -

బెజ్జూరుః కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని పాపన్‌పేట్ తదితర గ్రామాలకు బస్సులు, అటోలు తదితర వాహనాలు వెళ్లాలంటే ఇబ్బందిగా మారింది. బెజ్జూరు మండల కేంద్రం నుండి పాపన్‌పేట్ వరకు ఇటివల రోడ్డు పనులు ప్రారంభించారు. కానీ గోల్కోండ వాడలో ప్రధాన రహదారి సీసీ రోడ్డు పనులు నెల రోజులు గడుస్తున్న పూర్తిచేయకపోవడంతో సీసీ రోడ్డు రెండు వరుసలు రోడ్డు వేయాల్సి ఉండగా ఒక వరుస సీసీ రోడ్డు పనులు పూర్తి చేసి, మరో వరుస పూర్తి చేయకపోవడంతో బస్సులు, ఆటోలు తదితర వాహనాలు సైతం ప్రదాన రహదారి నుండి వెళ్లాలేక ఇరుకు రోడ్ల నుండి బస్సులు తదితర వాహనాలు వెళ్లడంతో కాలనీవాసులు దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నారు.

అంతే కాకుండా ఇరుకు రోడ్లలో వాహనాలు, చిన్న పిల్లలు సైతం అడుకుంటూ ఉంటారు. కానీ బస్సులు, లారీలు తదితర వాహనాలు వెళ్లడంతో ప్రజలు భయం భయంతో గడపాల్సిన పరిస్థితిగా మారింది. చిన్న పిల్లలు బయటకు వెళ్లిన సమయంలో అతివేగంగా వాహనాలు వెళ్లినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాలనీ వాసులు వాపోతున్నారు. అర్‌టిసి బస్సు వెళ్తున్న క్రమంలో రైస్‌మిల్ సమీప ప్రాంతంలో రహదారి పక్కన ఎడ్లబండ్లు నిలిపి ఉన్న క్రమంలో అదే సమయంలో అర్‌టిసి బస్సు రావడంతో ఎడ్లబండ్లను అర్‌టిసి బస్సు ఢీ కొంది. కానీ ఎడ్లబండిలో ఎవరు రైతులు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇప్పటికైన సంబంధిత ఆధికారులు వెంటనే స్పందించి రెండు వరుసల సీసీ రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ప్రయాణికులు, కాలనీవాసులు కొరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News