Monday, December 23, 2024

ఎస్‌బిఐ సర్వర్ డౌన్‌తో కస్టమర్లకు సమస్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బిఐ నెట్ బ్యాంకింగ్‌తో సహా అనేక సేవలు సోమవారం ఉదయం నుండి నిలిచిపోయాయి. దీంతో చాలా మంది వినియోగదారులు నిధుల బదిలీలో సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నెట్ బ్యాంకింగ్ సేవతో పాటు యుపిఐ, యోనో యాప్ సేవలు కూడా ఉదయం 9.19 నిమిషాల నుండి నిలిచిపోవడంతో ఖాతాదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ సమస్యలపై ఎస్‌బిఐ వివరణ ఇచ్చింది. సోమవారం సాంకేతిక సమస్యల వల్ల తమ డిజిటల్ సేవలు కొద్ది గంటల పాటు నిలిచిపోయాయని, దీనికి గాను విచారం వ్యక్తం చేస్తున్నామని ఎస్‌బిఐ వెల్లడించింది. సమస్యలను పరిష్కరించామని, సేవలను పునరుద్ధరించామని ఎస్‌బిఐ ఒక మీడియా సంస్థకు తెలిపింది.

‘కస్టమర్లు ఎదుర్కొన్న ఇబ్బందులకు గాను క్షమాపణ చెబుతున్నాం’ అని ఎస్‌బిఐ పేర్కొంది. వార్షిక ముగింపు కారణంగా ఐఎన్‌బి, యోనో, యుపిఐ సేవలను బ్యాంక్ ఏప్రిల్ 1న దాదాపు 3 గంటల పాటు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఎస్‌బిఐ ఇంకా అధికారికంగా గుర్తించలేదు. ఎస్‌బిఐ వినియోగదారులు యుపిఐ, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు విఫలమవుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై యూజర్లు ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నుంచి ఎస్‌బిఐ సేవలను వినియోగించుకోలేకపోతున్నామని కొందరు వినియోగదారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News