Wednesday, January 22, 2025

ధరణిలో ఇబ్బందులు 

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ధరణిలో చోటు చేసుకున్న లొసుగులతో చిన్న సన్న కారు రైతులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు భూముల సమస్య పరిష్కారం గాక తీవ్ర ఇబ్బందుల గురవుతున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ధరణిలో భూ రికార్డులు తారుమారు కావడంతో కొంతమంది రైతులకు రైతుబంధు, చనిపోయిన రైతులకు బీమా అందడం లేదని చాడ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల ఎకరాలలో సాదా బైనమా ద్వారా కొనుగోలు చేసిన భూములు పట్టా సర్టిఫికెట్ కోసం ఇప్పటికీ మీ సేవలో దరఖాస్తులు పెండింగ్ లో ఉండడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం సర్వే నెంబర్ల వారిగా సమగ్ర సర్వే జరిపించి భూ వివరాలను తీసుకొస్తామని నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ భూ తగాదాలు పరిష్కారం కాక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భూములు, శిఖం భూములు, వక్ఫ్ ల్యాండ్ తదితర భూములు అన్యాక్రాంత మవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే వేములవాడ నాంపల్లి శివారులో పండ్లగుట్టలో క్రషర్స్ తో భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. 381, 344 సర్వే నెంబర్లలో పేదలకు లావని సర్టిఫికెట్లు ఇచ్చి ఇప్పటికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఆ భూములన్నీ కబ్జాకోరు చేతిలోకి వెళ్తున్నాయని పేర్కొన్నారు. పేదలకు పట్టా సర్టిఫికెట్ ఇవ్వాలని దానికి సిపిఐ నిరంతర పోరాటం చేస్తుందని ఈ తరుణంలోనే రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి జరుగుతున్నది అన్నారు.
108 ఉద్యోగులకు పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్న ప్రకారం వేతనాలు పెంచి ఇవ్వాలి
108 ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాల నుండి చాలీచాలని వేతనాలతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని చాడ వెంకటరెడ్డి అన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అక్కడి ఉద్యోగులకు 35 వేల నుండి 36వేల రూపాయల వరకు వేతనాలు ఇస్తున్నారని, అదే జివికె సంస్థ తెలంగాణలో కూడా 108 నడిపిస్తుందని, ఇక్కడ మాత్రం నామమాత్రంగా 18 వేల రూపాయల వేతనం చెల్లించడం అన్యాయమన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వారికి జీతాలు పెంచకపోవడం దుర్మార్గమని, పక్క రాష్ట్రాలలో ఇస్తున్న ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న 108 ఉద్యోగులకు వేతనాలు పెంచి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News