Thursday, January 23, 2025

కనీస సౌకర్యాలు లేని బాలికల సెకండరీ అండ్ ఉర్ధూ పాఠశాల

- Advertisement -
- Advertisement -

జనగామ: జనగామ జిల్లా కోర్టుకు ఎదురుగా ఉన్న బాలికల సెకండరీ అండ్ ఉర్ధూ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థినీలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్‌ఎస్‌యూఐ జనగామ జిల్లా అధ్యక్షులు చిలువేరు అభిగౌడ్ మరియు మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ అండ్ ముజ్జు అన్నారు. శనివారం జనగామలోని ప్రభుత్వ సెకండరీ మరియు మైనారిటీ పాఠశాలను ఎస్‌ఎస్‌యూఐ నాయకులు సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 100 మంది విద్యార్థినీలు కనీసం బాత్రూమ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల అధ్యాపకుల నిర్లక్షం చాలా దారుణంగా ఉందన్నారు. పాఠశాల మొత్తం తిరిగి సందర్శించగా అందులో ప్రైమరీ, సెకండరీ, ఉర్ధూతోపాటు అంగన్‌వాడీ కేంద్రం కూడా అందులోనే ఉందని, పాఠశాల ఆవరణ మొత్తం చెత్తతో నిండి పాడుబడిన బంగ్లాలా కనిపిస్తుందని అన్నారు.

పాఠశాలలో మొత్తం 200 పైగా ఉన్న విద్యార్థులకు కనీసం ఒక్క బాత్రూమ్ కూడా గతి లేదని, ఎన్నో సంవత్సరాల నుంచి కనీసం దానిని పట్టించుకునే నాదుడే లేడని, దాదాపు 100 మంది అమ్మాయిలు ఉన్నారని, వారు నిరుపయోగంగా ఉన్న బాత్రూమ్స్ వాడుతున్నారన్నారు. ఎక్కడ టాయ్‌లెట్స్ ఉపయోగించాల్సి వస్తుందేమో అన్న భయంతో వారు కనీసం నీరు కూడా తాగలేని దుస్థితిలో ఉన్నారని, పాఠశాల ప్రైమరీ విద్యార్థులు ఉపయోగించే టాయ్‌లెట్స్ వద్ద గుంతలు పడటం వల్ల పిల్లలు అందులో పడి గాయాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలోనే గోడల చాటుగా బాయ్స్ టాయ్‌లెట్స్ వాడుతున్నారని, మిడ్డే మీల్స్‌లో సైతం పెద్ద స్కామ్ నడిపిస్తున్నారని ఆరోపించారు.

పాఠశాలకు 110 మంది విద్యార్థులు వస్తే 70 మంది ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకుంటున్నారని, కానీ 110 మంది విద్యార్థులకు భోజనం పెట్టినట్లు రాస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడితే డీఈవోపై నెట్టివేస్తున్నారని, కనీసం టాయ్‌లెట్స్ అపరిశుభ్రత పై కూడా స్పందించలేనంత నిద్రావస్థలో ఉన్నారని ఆరోపించారు. వెంటనే మౌలిక వసతులు కల్పించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కొరారు. ఈ కార్యక్రమంలో గోపిచంద్, ప్రవీణ్, నవీన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News