Thursday, January 23, 2025

హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని ఎంపికి వినతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః  చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డికి సైబరాబాద్ హోంగార్డ్ సంఘం అధ్యక్షుడు అశోక్ వినతిపత్రం అందజేశారు. ఈమేరకు చేవెళ్ల ఎంపి డాక్టర్ రంజిత్‌రెడ్డిని సోమవారం సంఘం అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో హోంగార్డులు కలిశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని ఎంపి రంజిత్‌రెడ్డి హామీ ఇచ్చారని హోంగార్డుల సంఘం అధ్యక్షుడు అశోక్ తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డులు మన్మధరావు, కుమార్, కాజా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News