Wednesday, January 22, 2025

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి : టిఎన్‌ఎస్‌ఎఫ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ టిఎన్‌ఎస్‌ఎఫ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనుపాల కిషోర్ కుమార్ రెడ్డిల నేతృత్వంలో మంగళవారం ఈ మేరకు దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌కు చేరుకుని బిసి సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బిసి సంక్షేమ హాస్టల్ పరిస్థితులపై వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ చార్జీలు పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరినట్లు తెలిపారు. వర్షాకాలం మొదలైన క్రమంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లలో కనీస అవసరమైన త్రాగునీరు, మరుగుదొడ్లు సదుపాయాలు కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. సంక్షేమ హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షులు డీజే శివ గౌడ్, పోల్కార్ సాయిరాం, మచ్చ సైదులు, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద్, అధికార ప్రతినిధి చీమ మహేష్, అమరేందర్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు అజయ్ నకిరేకంటే గణేష్ జయేందర్, రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి కులుకులపల్లి జయేందర్, రవీందర్ నాయక్, అజయ్, హరికృష్ణ, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వినయ్, అజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News