Wednesday, January 22, 2025

విద్యా రంగ సమస్యల్ని పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ నిర్వహించారు. నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది.

ఈ సందర్భంగా పీడీఎస్‌యూ గుర్రం అజయ్, ఏఐఎస్‌ఎఫ్ దిడ్డి పార్థసారథి, పీడీఎస్‌యూ నరేశ్, ఎస్‌ఎఫ్‌ఐ పైసా గణేష్, యూఎస్‌ఎఫ్‌ఐ సందీప్, ఏబీఎస్‌ఎఫ్ బొట్ల నరేశ్ మాట్లాడుతూ.. కార్పొరేటు, ప్రైవేట్ ఫీజుల దందా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నా ప్రభుత్వం వాటి నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లే దన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులవుతున్నా యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు ఇవ్వ లేదన్నారు. ఉపాధ్యాయులు, పారిశుద్ధ కార్మికులు లేరన్నారు. తాగునీరు, మధ్యాహ్న భోజనం బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మూత్రశాలలు సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యా రంగం గొల్లుమ ంటుందన్నారు. ఇంటర్ పుస్తకాలు ఇప్పటి వరకు అందించలేదన్నారు.

గత నాలుగేళ్ల నుంచి రూ. 5177 కోట్ల ఫీజు రీఎంబర్స్‌మెంటు, స్కాలర్ షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేజీబీవీలు, గురుకులాలు, ఇంటర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసినా కేజీబీవీల్లో భవనాలు లేక అరకొర సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయన్నారు. సరైన నిధులు, లెక్చరర్స్ లేక, నాణ్యమైన సరిపడా భోజనాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం విద్యా రంగంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని, టీచర్స్, లెక్చరర్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. డీఎస్సీ వెంటనే వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా నాయకుడు ఆబర్ల విక్రమ్, ప్రశాంత్, ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు లెనిన్, ఎస్‌ఎఫ్‌ఐ నరేశ్, మహేష్, శ్యామ్, సుమంత్, కల్యాణ్, శ్రీకాంత్, సురేష్, రవి, ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News