Thursday, January 23, 2025

సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్స్, గురుకులాలలో మౌలిక వసతులు కల్పించి, అద్దె భవనాల్లో కొనసాగుతున్న బి ల్డింగ్స్‌కి సొంత భవనాలు నిర్మించాలని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్(టిఎస్‌ఎస్‌ఎ) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. టిఎస్‌ఎస్‌ఎ తలపెట్టిన విధ్యార్తి సింహగర్జనకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆదివారం జాతీయ బిసి సం క్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టిఎస్‌ఎస్‌ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ మేడి నాగరాజు, సింహగర్జన ఉద్దేశ్యాలను వి వరించారు. సంక్షేమ హాస్టల్స్ లో పూర్తిస్థాయి వా ర్డెన్సు వర్కర్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు ్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ప్రస్తుతం ఉన్న సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు తాత్కాలిక ప్రైవేట్ భవనాల్లో ఉండడం వల్ల కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. వాష్రూమ్స్ డైనింగ్ హాల్ లైబ్రరీస్ హాస్టల్లో సరిపడా గదులు లేక విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే వీటి పైన దృష్టి సాదించి సమస్యలను పరిష్కరించాలన్నారు గ్రేటర్ హైదరాబాద్‌లో 90 శాతానికి పైగా అద్దె భవనంలో కొనసాగుతుండటం వల్ల దూర ప్రాంతాల నుంచి మహానగరానికి వచ్చే విద్యార్థులు నిరంతరం సమస్యలతో సతమతమవుతున్నారన్నారు.

సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 23న ఖమ్మంలో జరిగే విద్యార్థి సింహగర్జన మీ టింగ్‌కి వేలాదిమంది తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూరెళ్ళ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నక్క వెంకటేష్ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు గద్దపాటి భరత్ మాదిగ టిఎస్‌ఎస్‌ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ మేడి నాగరాజు నిరుద్యోగ జెఎసి చైర్మన్ నీలం వెంకటేష్, బిసి సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ బిసి వి ద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లీ అంజి టిఎస్‌ఎస్‌ఎ స్టేట్ కోఆర్డినేటర్ కోట్ర ప్రభాకర్ రెడ్డి శైలజ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News