Friday, November 22, 2024

ఆశ్రమ పాఠశాలల్లో సమస్యల్ని పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎల్‌హెచ్‌పీసీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా అజ్మీర వెంకట్ మాట్లాడుతూ.. కొడకండ్ల మండలంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు లేరని మూసివేయడం జరిగిందన్నారు. ఆ పాఠశాలను వెంటనే తెరిపించాలని ఆవ్రమ పాఠశాలలో ఉన్న స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించి అక్కడ చుట్టు పక్కల ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. జిల్లాలో ఐటీడీఏ పరిధిలో నడుస్తున్న పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులకు అనుగుణంగా తరగతి గదులు, మూత్రశాలలు లేక అనేక సమస్యలను పరిష్కరించి సకాలంలో నోట్ బుక్స్‌లు అందించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలన్నారు. సమస్యల్ని పరిష్కరించని పక్షంలో ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోరిక ఉదయ్‌సింగ్, జాటోతు జేబీ నాయక్, భూక్య మోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News