Saturday, December 21, 2024

ఆరు నెలల్లో గ్రీన్‌కార్డుల దరఖాస్తులు క్లియర్

- Advertisement -
- Advertisement -

Process all green card applications within 6 months:US commission

అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ సిఫార్సు

వాషింగ్టన్: అమెరికాలో గ్రీన్‌కార్డులు, లేదా శాశ్వత నివాసం కోసం వచ్చిన దరఖాస్తులను ఆరు నెలల్లోగా ప్రాసెస్ చేయాలనే సిఫార్సును అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సిఫార్సును ఆమోదం కోసం అధ్యక్ష భవనం శ్వేత సౌధానికి పంపిచనున్నారు.ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయిన్స్, పసిఫిక్ ఐలాండర్స్‌పై నియమించిన ఈ అడ్వైజరీ కమిషన్ సిఫార్పును గనుక అమలు చేస్తే..గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న చాలామంది ఇండో అమెరికన్ల కల నెరవేరుతుంది. ఈ ప్రతిపాదనను ప్రముఖ ఇండో అమెరికన్ నాయకుడుఅజేయ్ జైన్ భుటోరియా అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ మీటింగ్‌లో తెరపైకి తెచ్చారు. దీనికి కమిషన్‌లోని 25 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు. అమెరికాలోని గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్ పెండింగ్‌ను తగ్గించేందుకు మరోసారి వీటిని సమీక్షించాలని కమిషన్ ‘ అమెరికా సిటిజన్‌షిప్ అండ్‌ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’కు సూచించింది. ఫ్యామిలీ గ్రీన్‌కార్డు అప్లికేషన్లు , డిఎసిఎ రెన్యువల్స్,ఇతర గ్రీన్ అప్లికేషన్ల సమయాన్ని తగ్గించడం కోసం ఈ ప్రతిపాదనలు చేసింది.

గ్రీన్‌కార్డు ఇంటర్వూలను కూడా వేగవంతం చేయడానికి ఈ కమిషన్ మరో సిఫార్సు చేసింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ విభాగమైన నేషనల్ వీసా సెంటర్ ఈ ఏడాది ఆగస్టునుంచి అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని మూడు నెల్లోగా వందశాతం ఇంటర్వూలను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏప్రిల్‌నాటికి ఉన్న 32,439 ఇంటర్వూలు,నిర్ణయాలు తీసుకునేసామర్థాన్ని ఏచ్చే ఏడాది ఇదే సమయానికి 150 శాతం పెంచాలనిపేర్కొంది. ఆతర్వాతగ్రీన్‌కార్డుల ఇంటర్వూలు, ప్రాసెసింగ్‌కు కాలవ్యవధి ఆరునెలలు ఉండేలా చూసుకోవాలని కమిషన్ తెలిపింది. అమెరికాలో వర్క్‌పర్మిట్లు ఇతర అంశాల విషయంలో యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు కూడా కమిషన్ కీలక సూచనలు చేసింది.

వర్క్ పర్మిట్లు, ట్రావెల్ డాక్యుమెంట్లు, తాత్కాలిక పొడిగింపులు, ఇతర మార్పులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సిఫార్సు చేసింది. అమెరికాలో ఏప్రిల్ నాటికి 4,21,358 ఇంటర్వూలు పెండింగ్‌లో ఉన్నాయని భుటోరియా తెలిపారు. మార్చిలో వీటి సంఖ్య 4,36,700గా ఉంది. అమెరికా జనాభా సంఖ్య అనుకున్నంత వేగంగా పెరగడం లేదని భుటోరియా అభిప్రాయపడ్డారు.ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మార్పులు లేకపోవడం కూడా ఈ మందగమనానికి కారణమవుతోందన్నారు. ప్రస్తుత విధానాలు 1990లో అమలులోకి తెచ్చారని, ఆ తర్వాత పెద్దగా మార్పులు జరగలేదని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News