Wednesday, January 22, 2025

పారదర్శకంగా న్యాయమూర్తుల నియామక ప్రక్రియ: సిజెఐ చంద్రచూడ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియమక ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. శుక్రవారం రాంజెత్మలానీ స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి నిర్దేశిత ప్రమాణాలను రూపొందిస్తామన్నారు. నియామకాలకు సంబంధించి దేశంలోనే అత్యున్నత న్యాయమూర్తులను మదింపు చేసేందుకు విస్తృత ప్రాతిపదికన సెంటర్ ఫర్ ప్లానింగ్ అండ్ రిసెర్చ్ కసరత్తు చేస్తోందని సిజెఐ తెలిపారు. న్యాయమూర్తులు, వారు ఇచ్చిన తీర్పులపై అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఈ మదింపు చేపడతారని తెలిపారు.

దేశంలోని 50 మంది అత్యున్నత న్యాయమూర్తులను సర్వోన్నత న్యాయస్థానంలో నియమించేందుకు మదింపు ప్రక్రియ సాగుతుందని తెలిపారు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను ఎంపిక చేస్తారని, నాలుగు గోడల మధ్య ఈ తతంగం సాగుతోందని సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై గతంలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మూడు దశాబ్దాల కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లోపించిందని,జవాబుదారీతనం లోపించిందనే అసంతృప్తి నెలకొంది. కాగా ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ కూడా నూరు శాతం సజావుగా ఉండదని గతంలో చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కొలీజియం వ్యవస్థపై స్పందిస్తూ ప్రస్తుత వ్యవస్థలోనే మనదైన పరిష్కారం కోసం ప్రయత్నించాలని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News