Thursday, January 23, 2025

పూర్తయిన ఈవీఎంల తరలింపు ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ బ్యూరో : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) తరలింపు ప్రక్రియ ఆదివారం పూర్తయ్యింది. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుంచి ఆయా అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాలకు ఈవీఎంలు తరలించే ప్రక్రియను శనివారం చేపట్టగా, ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి. యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎంల తరలింపు సాఫీగా ముగిసింది.

రాండమైజెషన్ జాబితాను అనుసరిస్తూ కంట్రోల్ యూనిట్లు బ్యాలెట్ యూనిట్లు వివి ప్యాట్లను సంబంధిత నియోజక వర్గాల రిటర్నింగ్ సహాయ, రిటర్నింగ్ అధికారులకు అప్పగించగా పోలీసు బందోబస్తు నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రత్యేక వాహనాల్లో వాటిని నియోజక వర్గ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపర్చారు. ఈ ప్రక్రియలో నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ ఎం. మకరంద్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, భుజంగరావు, వినోద్‌కుమార్, సహాయ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విభాగం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News