సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
అదే కరెక్ట్ అనుకున్నాం…
స్టార్ హీరో బాలకృష్ణతో జర్నీని మాటల్లో చెప్పలేను. బయట మాట్లాడుకునే బాలకృష్ణ వేరు. ఆయనతో కలిసి ప్రయాణం చేశాక బాలకృష్ణ వేరు. స్క్రీన్ మీద బాలకృష్ణ వేరు. ఇక మా సినిమాకు ఓటీటీ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. ఇలాంటి సినిమాను థియేటర్లలో చూస్తేనే కరెక్ట్ అని నిర్ణయించుకున్నాం. చివరికి డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.
విజువల్ వండర్‌గా…
సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తరువాత నుంచి చివరి వరకు అలా చూస్తుండిపోతారు. విజువల్ వండర్‌గా ఉంటుంది ఈ చిత్రం. ఏ సినిమాకైనా కథే ముందు… ఆ తరువాతే స్టార్ హీరో అయినా, స్టార్ డైరెక్టర్ అయినా. ఈ చిత్రం సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది.
అన్నీ కుదిరాయి…
బాలకృష్ణ వందో సినిమాను బోయపాటితో చేయాలని అనుకున్నాను. లెజెండ్ సినిమా సమయంలోనే మహజ్జాతకుడు అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా కథను బాలకృష్ణకి బోయపాటి వినిపించారు. చివరికి అన్నీ కుదిరాయి. ద్వారకా క్రియేషన్స్ రవీందర్ రెడ్డితో ఈ సినిమా చేద్దామని బాలకృష్ణతో బోయపాటి అనడంతో ఆయన సరేనన్నారు.
కథకు టైటిల్ పర్ఫెక్ట్గా…
అఖండ అంటే అనంతం.. కాదనలేని సత్యం. సినిమా చూశాక.. ఆ టైటిల్ ఎందుకు పెట్టారా? అని తెలుస్తుంది. కథకు టైటిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అఘోరాలు అంటే సమాజానికి సంబంధం లేని వ్యక్తులు కాదు. వారు వ్యక్తిగతం కన్నా.. దైవం, ప్రకృతిపై స్పందిస్తుంటారు. అలాంటి క్యారెక్టర్‌తో సమస్యలను పరిష్కరించడమనేది కథ.
అందుకే సింపుల్‌గా…
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేశాం. కానీ బాలకృష్ణకి సర్జరీ జరగడంతో సింపుల్‌గా చేయాలని అనుకున్నాం. అందుకే హైదరాబాద్‌లోని శిల్పా కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం.
శ్రీకాంత్ కెరీర్ టర్న్ అవుతుంది…
లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ తీసుకుందో.. అఖండ సినిమాతో శ్రీకాంత్ కెరీర్ టర్న్ అవుతుంది. ఈ చిత్రంలో జగపతి బాబు కూడా ఉన్నారు. ఆయనకు కొన్ని సీన్లే ఉంటాయి. కానీ సినిమాను గైడ్ చేసే కీలకమైన రోల్ పోషించారు.
Produce Miryala Ravinder Reddy about ‘Akhanda’