Thursday, January 23, 2025

మాలిక్‌ను కోర్టులో హాజరుపర్చండి

- Advertisement -
- Advertisement -

Produce Yasin Malik in court: CBI

సిబిఐకి జమ్ము న్యాయస్థానం ఆదేశం

జమ్ము: తీహార్ జైల్లో ఉన్న జెకెఎల్‌ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్‌ను న్యాయస్థానంలో హాజరుపర్చాలని జమ్ము ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. అక్టోబర్ 20న మాలిక్‌ను కోర్టులో హాజరుపరచాలని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సిబిఐ ఆదేశించింది. 1989లో అప్పటి కేంద్ర మంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ కుమార్తె రూబియా సయ్యద్ అపహరణ జరిగింది. ఈ కేసులో సాక్షులను క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు ప్రత్యేక న్యాయస్థానం సిబిఐకి వారెంట్ జారీ చేసింది. విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన రూబియా సయ్యద్ మాట్లాడుతూ అపహరణ ఘటన నుంచి తేరుకుని సాధారణ జీవితం గడిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన జెకెఎల్‌ఎఫ్ మాలిక్ తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు.

భౌతికంగా విచారణకు హాజరయ్యేందుకు మాలిక్ పట్టుబట్టడంతో కోర్టు తదుపరి విచారణకు హాజరవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. తీహార్ జైలు అధికారులు మాలిక్‌ను కోర్టులో హాజరుపరుస్తారని సిబిఐ తరఫున న్యాయవాది మోనికా కోహ్లీ తెలిపారు. కాగా 8 డిసెంబర్ 1989లో రుబియా అపహరణ జరిగింది. అనంతరం ఆమెను ఐదురోజుల తరువాత తీవ్రవాదులు విడుదల చేశారు. కేంద్రంలోని బిజెపి మద్దతుతో ఉన్న విపి సింగ్ ప్రభుత్వం ఆమె విడుదలకు బదులుగా ఐదుగురు టెర్రరిస్టులను విడుదల చేసింది. ప్రస్తుతం రుబియా తమిళనాడులో నివసిస్తున్నారు. ఈ ఏడాది జులై 15న ఆమె తనను కిడ్నాప్ చేసినవారిలో ఉన్న మాలిక్ మరో ముగ్గురిని గుర్తించింది. 56ఏళ్ల మాలిక్ ఉగ్రవాదులకు నిధుల సమీకరణ కేసులో ఢిల్లీ ఎన్‌ఐఎ కోర్టు శిక్ష విధించడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ తీహార్ జైల్లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News