Saturday, November 9, 2024

‘టైగర్ నాగేశ్వరరావు’ నా ఆల్ టైం ఫేవరేట్ మూవీ

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కృష్ణ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలని పంచుకున్నారు.

‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ని దేశవ్యాప్తంగా చూపించాలని అనుకోవడానికి కారణం?
బయోపిక్స్ జనరల్ గా నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులపై చేస్తారు. అయితే ఒక దొంగకి బయోపిక్ ఎందుకు చేశామో సినిమా చూసినప్పుడు అర్ధమౌతుంది. ఒక మనిషి దొంగ ఎందుకయ్యాడు ? దొంగ అయిన తర్వాత ఏం చేశాడు? వీటన్నటికి కారణాలు వుంటాయి. ఇవన్నీ ఈ బయోపిక్ లో వుంటాయి. కంటెంట్ బేస్డ్, అన్ టోల్డ్ స్టొరీస్ చెప్పాలనేది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ లక్ష్యం. ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా పవర్ ఫుల్ కంటెంట్ వున్న సినిమా.

ఈ బయోపిక్ చేయడానికి నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారా ?
ఈ కథ చేసినప్పుడే దర్శకుడు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులని సంప్రదించి, వివరాలు తెలుసుకొని, వారి అనుమతి తీసుకున్నారు.

ఒకేసారి మూడు పెద్ద సినిమాలు రావడం వస్తున్నాయి కదా? ఈ పోటీని ఎలా చూస్తారు ?  
మేము ముందు అనుకున్నట్లుగా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాం. పండక్కి రెండు మూడు పెద్ద సినిమాలు రావడం సహజమే. మా ప్రోడక్ట్, కంటెంట్ పై చాలా నమ్మకంగా వున్నాం. అలాగే మా ప్రేక్షకులపై నమ్మకం వుంది. తప్పకుండా సినిమాని గొప్పగా ఆదరిస్తారు. నార్త్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వుంది.

ఇది మీ బ్యానర్ లో చాలా భారీ బడ్జెట్ సినిమా కదా ?మొదలుపెట్టినపుడు రిస్క్ అనుకున్నారా ?
కథకు ఏం కావాలో అది వందశాతం ఇస్తాను. అలా ఇస్తేనే అవుట్ కమ్ ఇంత అద్భుతంగా వస్తుంది.  సినిమా నిర్మాణంలో ఎప్పుడూ రాజీపడను.

మీరు ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేశారు.. దర్శకుడు వంశీకి ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. ఎలాంటి సూచనలు ఇచ్చారు ?
అన్నీ కలిసే నిర్ణయాలు తీసుకుంటాం. మా మధ్య డైరెక్టర్ ప్రొడ్యుసర్ అనుబంధం కంటే ఒక బ్రదర్స్ రిలేషన్ వుంది. ఆ రిలేషన్ తోనే ముందుకు వెళ్లాం. ఇదివరకే చాలా సార్లు చెప్పాను. ఈ సినిమాకి దర్శకుడే కాదు నిర్మాతగా కూడా ఆయన భాద్యత తీసుకొని చేశారు.

రవితేజ గారుఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్, రిస్క తీసుకున్నారు కదా ?
రవితేజ గారు అద్భుతంగా సపోర్ట్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు, యాక్షన్ సీక్వెన్స్ లన్నీ ఆయననే చేశారు. ఆయన చేతికి గాయమైనప్పటికీ ప్రొడక్షన్ కి ఎంతో సపోర్ట్ చేస్తూ షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు.
‘టైగర్ నాగేశ్వరరావు’ నా ఆల్ టైం ఫేవరేట్ మూవీ గా నిలిచిపోతుంది. ఈ జర్నీ చాలా డిఫరెంట్, మెమరబుల్. మంచి ప్రోడక్ట్ తీసుకురావాలని సమిష్టి కృషితో ఈ సినిమా చేశాం.

అనుపమ్ ఖేర్ మీకు సెంటిమెంటా ?
అనుపమ్ ఖేర్ అంటే మా లక్కీ ఛార్మ్. నన్ను ఒక బిడ్డలా చూస్తారు. తప్పుఒప్పులు చెప్తారు. ఏదైనా ఒక పాత్ర చేయాలని అడిగితే మరో మాటలేకుండా ఓకే చేస్తారు. నాపై అంత నమ్మకం వుంచడం ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.

రేణు దేశాయ్ గారి పాత్ర ఎలా వుంటుంది ?
రేణు దేశాయ్ గారి పాత్ర మర్చిపోలేని విధంగా వుంటుంది. రేణు దేశాయ్ 2.o ని ప్రేక్షకులు చూస్తారు.

హిందీలో కూడా చాలా జోరుగా ప్రచారం చేశారు కదా ?
‘టైగర్ నాగేశ్వరరావు’ మా డ్రీం ప్రాజెక్ట్. మొదటి నుంచి ఈ సినిమా ప్రచారం పై ప్రత్యేక దృష్టి పెట్టాం. తెలుగులో ఫస్ట్ లుక్ రాజమండ్రిలో గ్రాండ్ గా లాంచ్ చేశాం. తర్వాత నార్త్ లో ట్రైలర్ లాంచ్ చేశాం. మా డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఏం చేయాలో అన్నీ చేశాం, నార్త్ నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వుంది.

జీవీ ప్రకాష్ మ్యూజిక్ గురించి?
జీవీ ప్రకాష్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. థియేటర్ లో నేపధ్య సంగీతాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ సినిమా టెక్నిషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్ అద్భుతంగా చేశారు. అందరూ చాలా ప్రేమించి చేసిన సినిమా ఇది. అందుకే ఇంత అద్భుతమైన అవుట్ కమ్ వచ్చింది.

నేషనల్ అవార్డ్ అవార్డ్ అందుకోవడం ఎలా అనిపించింది ?
ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. వచ్చిన మూడేళ్ళలో నిర్మాతగా జాతీయ అవార్డు అందుకోవడం మా సంస్థకు ఎంతో గౌరవాన్ని తెచ్చింది. ఇంతకంటే నిర్మాత ప్రేక్షకులు, దేవుడు నుంచి ఏం కోరుకోవాలి.

సోలో సినిమాల జర్నీ మొదలుపెట్టారు.. తర్వాత మీ ప్రయాణం ఇలానే వుంటుందా ?
ప్రాజెక్ట్ ఎలా కుదిరితే అలా వుంటుంది. త్వరలో మరో బయోపిక్ అనౌన్స్ చేస్తున్నాం. ఇది కూడా చాలా సర్ ప్రైజ్ గా వుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News