Thursday, January 23, 2025

‘రావణాసుర’ విశేషాలను పంచుకున్న నిర్మాత అభిషేక్ నామా..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్ పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో నిర్మాత అభిషేక్ నామా మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…

కొత్త కాన్సెప్ట్ ఇది…
రావణాసుర సినిమాకు కర్త కర్మ క్రియ అంతా హీరో రవితేజ. ఆయనే కథని ఫైనల్ చేసి నన్ను పిలిచి సినిమా చేయమని చెప్పారు. రవితేజ కూడా ఇందులో ఒక నిర్మాత. ఇంతవరకూ రవితేజ ఇలాంటి సినిమా చేయలేదు. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన ఇలా కూడా చేయగలుగుతారా? అని ప్రేక్షకులు షాక్ అవుతారు. కొత్త కాన్సెప్ట్ ఇది. ఇది వర్కవుట్ అయితే హీరోలు ఇలాంటి మరిన్ని కథలు ప్రయత్నిస్తారు.

తెలిసిపోతే ఆ కిక్కు రాదు…
థ్రిల్లర్ జోనర్స్ చూసినప్పుడు షాకింగ్ ఫ్యాక్టర్స్ వుంటాయి. అవి ముందే ఆడియన్స్‌కి తెలిసిపోతే ఆ కిక్కు రాదు. అందుకే కథ గురించి బయటికి చెప్పలేదు. ఇక అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశాం. దర్శకుడు సుధీర్ వర్మ టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్‌కి సినిమాను పూర్తి చేశాడు.

కొత్త అనుభూతినిస్తుంది…
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ అయిపోయి షాక్‌లో వుంటారు. రవితేజని ఇంత కొత్త కోణంలో చూసే సరికి అదిరిపోయిందని అంటారు. ఇంటర్వెల్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది.

తనకి చాలా ప్రతిభ ఉంది…
సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ కుటుంబం అంతా సంగీతకారులు. తనకి చాలా ప్రతిభ ఉంది. మొదట ‘సాక్ష్యం’ సినిమా ఇచ్చాను. తర్వాత రవితేజకి చెప్పాను. రావణాసుర చిత్రంతో తన ప్రతిభని మరోసారి నిరూపించుకున్నాడు.

తదుపరి చిత్రాలు…
‘ప్రేమ విమానం’ సినిమా పూర్తయింది. వచ్చే నెల విడుదల చేస్తున్నాం. ‘డెవిల్’ సినిమా క్లైమాక్స్ నడుస్తోంది. రెండు, మూడు నెలల్లో ఏదైనా మంచి డేట్ చూసి విడుదల చేస్తాం.‘ డెవిల్ 2’ కూడా ఉంది. ఇక 2024లో దాదాపుగా ఏడు సినిమాలు లాంచ్ చేస్తాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News