మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ‘భోళా శంకర్’ శుక్రవారం విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత అనిల్ సుంకర మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
అలా ఈ సినిమా జర్నీ ప్రారంభం…
నా దగ్గర వేదాళం మూవీ కన్నడ రైట్స్ వున్నాయి. మెహర్ రమేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని గుంటూరులో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ సమయంలో చిరంజీవికి వేదాళం రీమేక్ అయితే ఎలా వుంటుందని మాట్లాడేవాళ్ళం. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది. చిరంజీవి అనుభవం మా అందరికీ కలిసొస్తుంది. ఆయన చాలా చురుగ్గా వుంటారు. ఆయన సమయపాలన అద్భుతం. భోళా శంకర్ మూవీ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం. ఈ సబ్జెక్ట్ వల్లనే మాకు చిరంజీవి డేట్స్ వచ్చాయి.
అనుకున్నంత తేలిక కాదు…
ప్రస్తుతం అన్ని సినిమాల బడ్జెట్‌లు ఎక్కువవుతున్నాయి. పదేళ్ళ ముందుకి ఇప్పటికీ అన్నీ పెరిగాయి. నాకు సినిమాపై పూర్తి అవగాహన వుంటుంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. నేను బడ్జెట్‌ను తగ్గించడానికే ప్రయత్నిస్తా. కానీ మనం అనుకున్నంత తేలిక కాదు. అప్పటికి ఇప్పటికీ రెవెన్యూ స్ట్రీమ్స్ కూడా పెరిగాయి. దానికి తగ్గట్లు ఖర్చులు వుంటాయి.
బ్రదర్, సిస్టర్ ఎమోషన్ యూనివర్సల్…
భోళా శంకర్ మూవీ మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమా అవుట్‌పుట్‌పై చిరంజీవి, మేము చాలా హ్యాపీ గా వున్నాం. ఖచ్చితంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. బ్రదర్, సిస్టర్ ఎమోషన్ యూనివర్సల్. అందరికీ కనెక్ట్ అవుతుంది.
మరొకరిని ఆ పాత్రలో ఊహించలేను…
సిస్టర్ పాత్రలో కీర్తి సురేష్ వుండాలని ముందే నిర్ణయించుకున్నాం. నేను, మెహర్ రమేష్ చెన్నైలో కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి ఫైనలైజ్ చేసుకున్నాం. నా కెరీర్ లో ఒకరి దగ్గరికి వెళ్లి డేట్స్ తీసుకోవడం ఇదే తొలిసారి. ఎందుకంటే ఈ పాత్రకు ఆమె అంత ముఖ్యం. నేను సినిమా చూసిన తర్వాత.. చిరంజీవి, కీర్తి సురేష్ మధ్య అనుబంధం జీవితంలో మర్చిపోలేనిదిగా నిలిచిపోయింది. కీర్తిని తప్పితే మరొకరిని ఆ పాత్రలో ఊహించలేను.
పాటలు, రీ రికార్డింగ్ అద్భుతంగా…
మహతి సాగర్ ఈ సినిమాకు చాలా మంచి పాటలు ఇచ్చాడు. రీరికార్డింగ్ కూడా అద్భుతంగా చేశాడు. ఇక 14 రీల్స్ బ్యానర్‌లో ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నాం.
మెగాస్టార్‌తో ప్రయాణం మరచిపోలేనిది
- Advertisement -
- Advertisement -
- Advertisement -