Wednesday, January 22, 2025

ఆస్తులను రాయించుకొని నిర్మాత అంజిరెడ్డిని చంపారు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిర్మాత అంజిరెడ్డిని కేసును పోలీసులు ఛేదించారు. నిర్మాతను చంపిన కాట్రగడ్డ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మాత ఆస్తుల కోసమే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. బిహార్ కు చెందిన ఇద్దరుతో కలిసి నిర్మాత అంజిరెడ్డిని హత్య చేశారు. నిర్మాత అంజిరెడ్డి ఆస్తులు అమ్మి అమెరికాకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్మాత అంజిరెడ్డి ఆస్తులు అమ్మే పని రవికి అప్పజెప్పారు. ఆస్తులను తన పేరు మీద రవి రాయించుకొని అంజిరెడ్డిని హత్య చేసినట్టు గుర్తించారు. గత నెల 29న నిర్మాత అంజిరెడ్డి హత్య సికింద్రాబాద్ లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిర్మాతను చంపి రోడ్డు ప్రమాదంగా కాట్రగడ్డ రవి చిత్రీకరించారు.

Also Read: భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News