Sunday, December 22, 2024

నిర్మాత బండ్ల గణేష్ డ్రైవర్ భార్య ఆత్మహత్య..!

- Advertisement -
- Advertisement -

చట్నీ విషయంలో భార్యభర్తల మధ్య తలెత్తిన గొడవ…చివరికి భార్య ప్రాణం తీసింది. ఈ దారుణ సంఘటన నగరంలోని బంజారాహిల్స్‌ పిఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం గోప తండాకు చెందిన రమణ, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన(25)ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరిద్దరూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని ఇందిరానగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.

రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్‌ వద్ద డ్రైవర్‌‌గా రమణ పనిచేస్తుండగా.. చందన ఓ నగల దుకాణంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అన్నంలో చట్నీ ఎక్కువైందని రమణ, భార్యతో గొడవపడినట్లు తెలుస్తోంది. తర్వాత సోమవారం ఉదయం రమణ తన డ్యూటీకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చందన పలుమార్లు భర్తకు వీడియో కాల్ చేసినా అతను స్పందించలేదు. దీంతో ఫోన్ కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి పెట్టేసింది.

వెంటనే రమణ.. ఇంటి యజమానికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి తన ఇంటికి వెళ్లి చూడమని కోరాడు. దీంతో యజమాని వెళ్లి చూడగా.. అప్పటికే చందన ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై యజమాని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం రమణను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News