Monday, December 23, 2024

25ఏళ్లు పూర్తిచేసుకోవడం నా అదృష్టం

- Advertisement -
- Advertisement -

నిర్మాతగా ప్రయాణాన్ని ప్రారంభించి 25 ఏళ్ళు అయ్యింది. ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వం డర్‌ఫుల్ జర్నీ. ఇది నాకు 57వ బర్త్ డే. 2015లో గంగ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. తర్వాత సినిమా చేయలేదు. మళ్ళీ ఏప్రిల్ నుంచి ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాను”అని అన్నారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్. నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు బెల్లంకొండ సురేష్. అలాగే గురువారం ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మీడియాతో ము చ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
‘సాంబయ్య’తో సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణం..
నిర్మాతగా 25 ఏళ్లలో 38 సినిమాలు చేశాను. ఈ జర్నీ పట్ల చాలా హ్యాపీగా వున్నాను. కీర్తి ప్రతిష్టలు ఇండస్ట్రీలోనే సంపాదించుకున్నాను. -శ్రీహరితో సాంబయ్య సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని ప్రారంభించాను. ఆ సినిమా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీహరి మన మధ్య లేకపోవ డం చాలా బాధకరంగా వుంది. తను మంచి నటు డే కాదు గొప్ప వ్యక్తి.
ఏప్రిల్‌లో ఇద్దరి అబ్బాయిల ప్రాజెక్ట్‌లు..
-ఏప్రిల్ నుంచి మళ్ళీ సినిమాలు ప్రారంభిస్తున్నా ను. మొదట మా అబ్బాయితో సినిమా ప్రారంభి స్తా. పిల్లలు బయట సినిమాలు చేస్తున్నారు. అం దుకే నేను గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. పెద్ద అబ్బా యి కెరీర్ సెట్ అయ్యింది. చిన్నబ్బాయి సెట్ చేసుకుంటున్నాడు. రెండు మంచి ప్రాజెక్ట్ వచ్చాయి. వాటితో తను కూడా సెట్ అయిపోతాడు. ఏప్రిల్ లో ఇద్దరి అబ్బాయిల ప్రాజెక్ట్‌లు ప్రారంభమవుతా యి. త్వరలోనే వాటి గురించి పూర్తి వివరాలు చెబుతాను.
పెద్ద అబ్బాయి సినిమాలు…
-పెద్ద అబ్బాయి శ్రీనివాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. టైసన్ నాయుడు, సాహూతో సినిమాలు జరుగుతున్నాయి. గరుడన్‌కి రిమేక్‌గా చేస్తున్న సినిమా క్రిస్మస్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కోడిరామకృష్ణ అల్లుడి నిర్మాణంలో చే స్తున్న సినిమా మాసీవ్ బడ్జెట్ ఫిల్మ్. దానికి చాలా సీజీ వర్క్ వుంటుంది. అది చాలా పెద్ద సినిమా. చాలా ఓపికగా చేస్తున్నారు.
మళ్ళీ బాలయ్యతో సినిమా చేస్తా…
-‘నా అటోగ్రాఫ్’ రీ చేయడానికి 4కేలో రెడీ చేశాను. నెక్స్ రవితేజ బర్త్ డేకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. -‘చెన్నకేశవ రెడ్డి’ రీరిలీజ్‌కు మే ము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన, రెవెన్యూ వచ్చింది. మళ్ళీ బాలయ్య బాబుతో వం దశాతం సినిమా చేస్తాను.
ఆయన నా దేవుడు…
-నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ మోహన్ బాబు. నాకు ఎవరూ సపోర్ట్ లేనప్పుడు ఆయన నన్ను సినిమాకి మేనేజర్‌ని చేశారు. ఆయన నా దేవుడు.
అలాంటి డైరెక్టర్‌తో చేయాలని ఉంది…
-పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని వుంది. హీరోయిజాన్ని మారుస్తాడు. హీరోని అద్భుతంగా చూపిస్తాడు. 90 రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్‌తో పని చేయాలని ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News