Sunday, December 22, 2024

తప్పుడు వార్తలు రాస్తే.. తాట తీస్తా: దిల్ రాజ్ ఫైర్

- Advertisement -
- Advertisement -

ప్రతి సంక్రాంతి పండుగకి నా మీద కొన్ని వెబ్‌సైట్లు లేనిపోనివన్నీ రాసి, నాపై బురద జల్లడం అలవాటు అయిపోయిందని, ఇక నుంచి అలాంటి వెబ్‌సైట్స్‌ని వదిలేది లేదని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. కొన్ని వార్తలని తెలియకుండా వక్రీకరించి రాస్తున్నారని, ఇకపై ఆలా రాస్తే ఊరుకునేది లేదని, ’తాట తీస్తాను’ అని హెచ్చరించారు.

సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న దిల్‌రాజు మాట్లాడుతూ “’హను-మాన్’ సినిమా ఫంక్షన్‌కి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరై… పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా కూడా ఆడుతుంది అని చెప్పారు. అంటే ఎన్ని పెద్ద సినిమాలు విడుదలవుతున్నా కూడా కంటెంట్ బాగుంటే చిన్న సినిమా కూడా ఆడుతుంది అని అర్థం వచ్చేలా చెప్పారు చిరంజీవి. అదేవిధంగా హను-మాన్ సినిమా కూడా ఆడుతుంది. ఆ మాటలకి కొన్ని వెబ్ సైట్స్ దిల్ రాజు మీద చిరంజీవి విమర్శలు గుప్పించారు అంటూ వక్రీకరించి రాశాయి.

ఇకపై నామీద తప్పుడు వార్తలు రాస్తే ’తాట తీస్తా’. హను-మాన్ సినిమాని 12న కాకుండా 14న విడుదల చేస్తే ఎక్కువ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను. అంతే కానీ విడుదల ఆపాలని చెప్పలేదు. ఈనెల 12న మహేష్ బాబు సినిమా ’గుంటూరు కారం’కి నైజాంలో థియేటర్స్ వున్నాయి, ’హను-మాన్’కి వున్నాయి, కానీ పెద్ద స్టార్స్ అయిన నాగార్జున, వెంకటేష్ సినిమాలకి ఆరోజు థియేటర్స్ దొరకలేదు అని చెప్పారు దిల్ రాజు. తమిళ సినిమా నేను విడుదల చేస్తున్నాను అని రాశారు. కానీ నేను ఆ తమిళ సినిమా విడుదల వాయిదా వేయించాను. తెలియకుండా ఇష్టమొచ్చినట్టు నా మీద కొన్ని వెబ్‌సైట్లు లేనిపోని వార్తలు రాస్తే మరోసారి హెచ్చరిస్తున్నా. ఇకనుండి… తాట తీస్తా” అని అన్నారు దిల్ రాజు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News