Wednesday, January 22, 2025

‘జైలర్’ యునానిమస్ బ్లాక్ బస్టర్ : దిల్ రాజు, సునీల్ నారంగ్      

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జైలర్‌’. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో  ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్,  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గ్రాండ్ గా విడుదల చేశాయి. ఈ రోజు ( ఆగస్టు 10) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి  బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో  జైలర్ సక్సెస్ మీట్ ని నిర్వహించారు.

సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..  జైలర్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మేము, ఏషియన్ మల్టీప్లెక్స్ కలసి విడుదల చేయడం జరిగింది. ప్రేక్షకులు, మీడియా, ఇండస్ట్రీ అన్ని వైపుల నుంచి రజనీకాంత్ గారికి మళ్ళీ బ్లాక్ బస్టర్ పడిందని చెబుతున్నారు. చాలా ఆనందంగా వుంది.  థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆంధ్రలో చాలా సెంటర్స్ లో మాట్నీ నుంచి అదనంగా థియేటర్స్ యాడ్  అవుతున్నాయి. జైలర్ కి ప్రపంచవ్యాప్తంగా యునానిమస్ గా  బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.  ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేము మొదటిసారి కలిసి విడుదల చేయడం, ఇంత పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా వుంది’’ అన్నారు.

నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ… ఈ చిత్రం రైట్స్ ని ఇచ్చిన సన్ పిక్చర్స్, కళానిధి మారన్ గారికి ధన్యవాదాలు. జైలర్ చాలా పెద్ద సూపర్ హిట్. సన్ పిక్చర్స్ కి మరోసారి కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా వారితో కలసి పని చేయాలని కోరుకుంటున్నాం. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News