Tuesday, March 4, 2025

నిర్మాత కేదార్‌ది సహజ మరణం..తేల్చి చెప్పిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

దుబాయ్‌లో పది రోజుల క్రితం అనుమానాస్పత్తిలో మరణించిన నిర్మాత కేదార్ మరణం పై ఎలాంటి అనుమానాలు లేవని దుబాయ్ పోలీసులు తేల్చారు కేదార్ ది సహజ మరణమే అని, ఎటువంటి అనుమానాస్పద కారణాలు లేవని రిపోర్ట్ లో వెల్లడించారు. కేదార్ భార్య రేఖా వీణకు కేదార్ మృతదేహాన్ని అప్పగించారు. భారత ప్రభుత్వ అనుమతితో కేదార్ భార్యకు మృతదేహాన్ని అప్పగించారు. దుబాయ్‌లోనే కేదార్ మృతదేహానికి ఆయన భార్య, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇండియాకి మృతదేహాన్ని తీసుకువస్తే ఇబ్బందులకు గుర వుతామని, అందుకే దుబాయ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే కేదార్‌కు కొందరు రాజకీయ నేతల తో సంబంధాలు ఉన్నాయని కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి. కానీ కేదార్ అంత్యక్రియలకు సినీ రాజకీయ ప్రముఖులు ఎవరు హాజరు కాలేదు. సినీ రాజకీయ ప్రముఖులకు మీడియేటర్‌గా ఉన్న కేదార్, కొందరు సినీ రాజకీయ నాయకుల సంబంధించి బినామీగా ఉండి వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది. సినీ రాజకీయ నేతల డబ్బులతో కేదార్ దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడని సినీ, రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News