Wednesday, December 25, 2024

బాలకృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం ’డాకు మహారాజ్’: వంశీ

- Advertisement -
- Advertisement -

అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ’డాకు మహారాజ్’. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ’డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “గత 20, -30 ఏళ్ళలో బాలకృష్ణని చూడనంత కొత్తగా ’డాకు మహారాజ్’లో కనిపించబోతున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది. బాలకృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ఒకటిగా ’డాకు మహారాజ్’ నిలుస్తుంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నాం. జనవరి 2న హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల వేడుక జరపాలి అనుకుంటున్నాం. జనవరి 4న యూఎస్‌లో ప్రీ రిలీజ్ వేడుక చేసి, ఒక పాట విడుదల చేయాలి అనుకుంటున్నాం. జనవరి 8న ఆంధ్రాలో ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నాం”అని అన్నారు.

దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ “సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. అదే సమయంలో ఈ సినిమా విజువల్‌గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ ఉంటాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది”అని తెలిపారు. ’డాకు మహారాజ్’ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంచలన స్వరకర్త తమన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News