Sunday, December 22, 2024

ఆ కారణంగా సక్సెస్ మీట్ నిర్వహించలేకపోతున్నాం

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన దేవర సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ నుంచి ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సోలోగా వచ్చింది. మరి దీనికి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా ప్లాన్ చేశారు కానీ అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో అనుకోని విధంగా సినిమా ఈవెంట్ లేకుండానే విడుదల కావాల్సి వచ్చింది. అయితే సినిమా సక్సెస్ అయ్యాక గ్రాండ్ సక్సెస్ మీట్‌ని పెడతారని టాక్ వచ్చింది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇప్పుడు వచ్చింది. సినిమాని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ మొదటిగా దేవరకి భారీ సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

అయితే ఈ సక్సెస్ మీట్ నిర్వహించాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ.. దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా, దేవర సినిమా విజయోత్సవ వేడుకల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు అనుమతులు పొందలేకపోయామని… అది మా చేతుల్లో లేదని అన్నారు. ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోతున్నందుకు అభిమానులు, ప్రేక్షకులకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామన్నారు. ఇక ‘దేవర’ సినిమాలో శుక్రవారం నుంచి ‘దావూదీ’ సాంగ్‌ను జత చేసి థియటర్లలో ప్రదర్శించనున్నారు. అయితే అంతకుముందు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పాటను సినిమాలో ప్రదర్శించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News