క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ అద్భుతమైన స్పందనతో గ్లోబల్ లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చైతన్య సమర్పిస్తున్నారు. హనుమాన్ సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాత కె నిరంజన్ రెడ్డి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
యూనివర్సల్ సూపర్ హీరో…
హను-మాన్.. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో కూడిన సూపర్ హీరో జానర్ మూవీ. ఆంజనేయ స్వామి చిరంజీవి. ఆయన ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తూ వున్నారని మనం నమ్ముతాం. హను-మాన్ మన రియల్, యూనివర్సల్ సూపర్ హీరో. ఆంజనేయ స్వామిని ఎలా చూద్దామని అనుకుంటారో ఈ సినిమా చూసి బయటికి వచ్చినపుడు అది ఫుల్ ఫిల్ అవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా ఆనందంగా ఫీలవుతారు.
మా నమ్మకాన్ని నిజం చేస్తూ…
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ కథ చెప్పినప్పుడే గ్లోబల్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా వుంది. మార్వల్ డీసి సినిమాలాగా మన ఇండియన్ సినిమాకి ఒక ఫ్రాంచైజ్ లేదు. అలా మనకు కూడా ఒక ఫ్రాంచైజ్ వుండాలని హను-మాన్ మూవీ చేశాం. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇది పెద్దది అవుతుందనే నమ్మకంతో చేశాం. మా నమ్మకాన్ని నిజం చేస్తూ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలలో కేవలం థియేట్రికల్‌గా 20 కోట్లు జరిగింది. ఓవర్సీస్, కర్నాటక, నార్త్ ఇండియాతో పాటు నాన్ థియేట్రికల్‌లో చాలా మంచి బిజినెస్ జరిగింది.
ఇలాంటి ఫీట్ సాధించడం చాలా అరుదు…
టీజర్ విడుదలైన తర్వాత అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు. ఈ డిజిటల్ యుగంలో ఇలాంటి ఫీట్ సాధించడం చాలా అరుదు. అప్పుడే ఇది గ్లోబల్ విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. ఈ కంటెంట్‌కు కావాల్సిన ప్రతీది ఎక్కాడా రాజీపడకుండా సమకూర్చాలని నిర్ణయించుకున్నాం. ‘హను–మాన్’ సినిమా వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీ అద్భుతంగా వుంటుంది. ప్రశాంత్ వర్మ విజన్ కి తగినట్లు వీఎఫ్‌ఎక్స్ అవుట్ పుట్ వచ్చింది. ఖర్చు చేసిన ప్రతీది తెరపై కనిపిస్తుంది.
చాలా గొప్ప విషయం…
ఇందులో కోటి అనే సర్‌ప్రైజ్ రోల్ వుంది. దీనికి రవితేజ వాయిస్ ఓవర్ చెప్పారు. ఆయన సినిమా వుండి కూడా ఈ కాంపిటీషన్‌లో సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయం. పరిశ్రమ ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీనే ఆశిస్తుంది. హను-మాన్ ట్రైలర్ అందరికీ అద్భుతంగా అనిపించింది. ట్రైలర్ కంటే పదిరెట్లు అద్భుతంగా వుంటుంది సినిమా.