Wednesday, January 22, 2025

సమంత అంకితభావానికి హ్యాట్సాప్

- Advertisement -
- Advertisement -

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సరోగసీ నేపథ్యంలో కొత్త కథతో ‘యశోద’ తీశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక మీడియాతో మాట్లాడుతూ.. ‘యశోద’ను అన్ని భాషల్లో చేయడానికి తగ్గ కథానాయిక ఎవరని చూస్తే సమంత అయితే బావుంటుందని అనిపించింది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో ఆవిడకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సమంతకు ఈ కథ చప్పగానే వెంటనే చేస్తానని అన్నారు. అన్ని భాషల్లో చేద్దామని చెబితే ఆమె ఓకే అన్నారు.

సమంత తర్వాత మరో కీలక పాత్రకు వరలక్ష్మీశరత్ కుమార్ తీసుకున్నాం. కథ డిమాండ్ చేయడంతో ఒక్కో పాత్రకు ఒక్కొక్కరిని ఎంపిక చేసుకున్నాం. ఆమె స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ’యశోద’తో సమంత ట్రావెల్ చేశారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డబ్బింగ్ టైమ్‌లో మాకు సమంత ఆరోగ్యం గురించి తెలిసింది. ఆమె తెలుగు డబ్బింగ్ చెప్పారు. తమిళంలో చెప్పే సమయానికి ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పించవచ్చని అన్నాను. కానీ తమిళంలో తన వాయిస్ అందరికీ తెలుసని ఆవిడే చెప్పారు. హిందీలో చిన్మయి చెప్పారు. మూడు నాలుగు రోజులు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు. సమంత డిడికేషన్‌కు హ్యాట్సాఫ్. ఈ చిత్రంలో సరోగసీ నేపథ్యంలో జరుగుతున్న క్రైమ్ చూపిస్తున్నాం’ అని అన్నారు.

Producer Sivalenka about Samantha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News