Monday, December 23, 2024

ఆదికి వచ్చే ఏడాది శుభారంభాన్నిచ్చే ‘టాప్ గేర్’

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం ‘టాప్ గేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రం శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు కె. శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కాబోతున్న సందర్భంగా నిర్మాత శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “టాప్ గేర్ సినిమా చాలా బాగుండబోతోంది. ఈ సినిమా ఆదికి వచ్చే ఏడాది శుభారంభం కానుంది. ఆది మంచి డ్యాన్సర్. మంచి నటుడు. టాప్ గేర్ సినిమాతో వచ్చే ఏడాది ఆయన దశ మారుతుంది. శశికాంత్ ఈ కథ చెప్పిన తరువాత నాకు చాలా నచ్చింది.

ఈ కథ విన్న తరువాత ఆది అయితే బాగుంటుందని మేం అనుకున్నాం. వెళ్లి కథ చెప్పాం. ఆయన ఓకే అన్నారు. టాప్ గేర్ సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో స్క్రీన్‌ప్లే హైలెట్ అవుతుంది. నెక్స్ సీన్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా సినిమాను తీశారు. ఈ సినిమాకు హర్షవర్దన్ మ్యూజిక్, ఆర్‌ఆర్ ప్లస్ అవుతుంది. క్యాబ్ డ్రైవర్‌లకు కస్టమర్లతో కూడా సమస్యలు వస్తుంటాయి. అలా అనుకోకుండా హీరో ఓ సమస్యలో చిక్కకుంటాడు. దానినుంచి ఎలా బయటపడతాడు అనేది కథ. తన భార్యను కాపాడుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ఆదికి 2023 సంవత్సరం చాలా బాగుండబోతోందని, టాప్ గేర్ సినిమాతో అది ప్రారంభం అవుతుందని సాయి కుమార్ చెప్పారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News