Monday, December 23, 2024

‘బాయ్స్ హాస్టల్’ క్రేజీ ఫన్ రైడ్ లా వుంటుంది. : నిర్మాత సుప్రియ యార్లగడ్డ

- Advertisement -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరే ను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇందులో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రల్లో నటించారు. బాయ్స్ హాస్టల్ ఆగస్టు 26న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత సుప్రియ యార్లగడ్డ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

- Advertisement -

నేరుగా పెద్ద సినిమాలు నిర్మించే సామర్ధ్యం వున్న మీరు డబ్బింగ్ సినిమాని చేయడానికి కారణం ?
మంచి సినిమా కాబట్టి.  ట్రైలర్ చూడగానే నవ్వొచింది. ప్రపంచంలో కెల్లా మంచి ప్రేక్షకులు మన దగ్గర ఉన్నారు. మంచి కంటెంట్ ఇస్తే చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ పరంగా మంచి సినిమాలు విడుదల చేయడంలో అందరికీ మంచి జరుగుతుంది. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ కి వాల్యు యాడెడ్ లా వుంటుంది.

మీరు రెడీ చేసే ప్రోడక్ట్ కి, వేరే భాషల్లో రెడీ అయిన ప్రోడక్ట్ ని మార్కెట్ చేయడానికి ఎలాంటి తేడా వుంటుంది ?
ఆ సినిమాలో పల్స్ అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.  ఒకప్పటి డబ్బింగ్ సినిమాకి ఇప్పటికి చాలా తేడా వుంది. ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తే అది తెలుగు సినిమాలా కనిపించాలి. క్యాలిటీ విషయంలో ప్రేక్షకులు ప్రత్యేకంగా వుంటున్నారు. ఈ సినిమా చూడగానే డబ్బింగ్ చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే వందకుపైగా వాయిస్ లు వున్నాయి. హాస్టల్ లో అల్లరి చేయడమే ఎనర్జీ, ఫన్. చాలా కేర్ తీసుకొని ప్రతి వాయిస్ ని నేటివిటి తగ్గట్టు డబ్ చేశాం. సినిమా చూస్తున్నప్పుడు  తెలుగు సినిమాలానే వుంటుంది. అంత నేచురల్ గా వచ్చింది.

చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ తో కొలాబరేట్ అవ్వడానికి కారణం ?
చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ మంచి వైబ్ తో వుంటారు. చాలా చక్కగా చేస్తున్నారు. ఓనర్షిప్ వుంటే రిజల్ట్ ఎలా వున్నా జర్నీ బావుంటుంది.

చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ తో కలసి స్ట్రెయిట్ సినిమా చేస్తారా ?
చేయాలి.

ఈ సినిమాని రీమేక్ చేయకపోవడానికి కారణం?
ఇది ఒరిజినల్ గానే రావాలి. అదొక జాయ్ రైడ్ . ఆ ఎనర్జీ, మ్యాజిక్ ని  రీ క్రియేట్ చేయలేం. ఈ రోజుల్లో సినిమా యూనివర్సల్ అయిపొయింది. ఒకవేళ సినిమాని రీమేక్ చేయాలంటే నేటివిటికి తగ్గట్టు అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

రష్మి గారిని ఎంపిక చేయడానికి కారణం ?
ఇందులో పాత్రకు రష్మి పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో చాలా హాట్ గా కనిపిస్తారు. తన పాత్రతో సినిమాకి మరింత నేటివిటి వచ్చింది. మనదంటూ ఒక ఫ్లేవర్ యాడ్ అయ్యింది.

ఈ సినిమా కన్నడలో జులై 26న విడుదలైయింది.., ఒక నెల గ్యాప్ లో తెలుగులో తీసుకురావడం ఎలా అనిపిస్తుంది ?
నెల అంటే చాలా ఎక్కువ. నెల అంటే ఇప్పుడు ఓ జీవత కాలం.రెండు రోజుల్లో జనాలు అన్నీ మర్చిపోతున్నారు. ఒక హిట్ సినిమా కూడా మళ్ళీ చూస్తే గానీ గుర్తుండటం లేదు.

డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎలా జరిగాయి ?
అన్నపూర్ణ లో మూడు డబ్బింగ్ స్టూడియోలు వున్నాయి. ఐతే ఈ సినిమాని ఆరు డబ్బింగ్ స్టూడియోస్ లో డబ్ చేశాం. అన్ని వాయిస్ లు ఇందులో వున్నాయి. అలాగే రైటింగ్ పై కూడా చాలా శ్రద్ధ పెట్టాం. ఒకేసారి పదిమంది మాట్లాడుతుంటే అందులో జోక్స్ పేలుతాయి. దాన్ని తెలుగులో రాయడం అంత ఈజీ కాదు. దీన్ని చాలా చక్కగా  రీ క్రియేట్ చేశాం.

హాస్టల్ బాయ్స్ గురించి మీకు తెలిసింది ఏమిటి ? మీరు హాస్టల్ లో చేసిన అల్లరి గురించి ?
నాకు హాస్టల్ బాయ్స్  గురించి  ఏం తెలియందడీ.(నవ్వుతూ) నేను ఎప్పుడూ హాస్టల్ లో లేను. ఇంట్లో పంపించలేదు. ఐతే హాస్టల్ లో వుండే ఫ్రెండ్స్ ఉండేవారు. ఒకరోజు ఓ హాస్టల్ క్యాంటీన్ లో భోజనం చేశా. ‘’ఇది మన వల్ల కాదు.. మా నాన్న ఓ అపార్ట్మెంట్ తీసిపెట్టారు. అక్కడే వుండాలని ఫిక్స్ అయిపోయా’’(నవ్వుతూ). ఐతే నా ఫ్రెండ్స్ అందరూ నేను వుండే అపార్ట్మెంట్ కి రావడంతో అదొక మినీ సైజ్ హాస్టల్ లా అయిపోయింది(నవ్వుతూ).

అన్నపూర్ణ  సినిమా  ల నిర్మాణంలో కొంత గ్యాప్ వచ్చింది కదా..  కారణం ?
ఇప్పుడున్న పరిస్థితులలో సినిమాలు తీసే విధానం, పరుగు మారిపోయింది. మేము యాభై ఏళ్ళుగా నిలకడగానే వున్నాం. దాదాపుగా ఏడాదికి ఒక సినిమా చేస్తూనే వున్నాం. ఈ విషయంలో మేము పెద్దగా మారలేదనే అనుకుంటున్నాం.

సరైన కంటెంట్ రావడం లేదని భావిస్తున్నారా ?
కంటెంట్ విషయం కాదండీ. కంటెంట్ ని ప్రారంభం నుంచి చివరివరకూ తీసుకెళ్లగలగాలి. ఒక టీం ఒక ప్రాజెక్ట్ ని మాత్రమే చేయగలుగుతారు. అందుకే ఇప్పుడు కొలాబరేషన్స్ పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ స్టూడియోస్ లో  ట్రెండీ కంటెంట్  చేయడంలో ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు ?

లెగసీ ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ‘మనం’ కోసం రెండేళ్ళ పనిచేశా. మరో పది రోజులు వుందనగా తాతగారి కండీషన్ తెలిసింది. అప్పటికే ఆయన 255 సినిమాలు పూర్తి చేసుకున్నారు. అది ఆయన చివరి సినిమాగా పూర్తి చేయాలని అనుకున్నపుడు నాపై ఎంత ఒత్తిడి వుంటుందో మీరే ఆలోచించండి. రోజు 22 గంటలు పని చేశాం. సినిమా విజయవంతమైయింది..అది వేరే విషయం. ఎవరితో తిట్టించుకోలేదనే గొప్ప విషయం(నవ్వూతూ).  తాతగారు నన్ను తిడుతూనే వుంటారు. ఇప్పటికి నెలకోసారి కల్లోకి వస్తారు. ఏదో తిడతారు(నవ్వుతూ).
ఏదేమైనప్పటికీ లెగసీని కాపాడుకోవడం ముఖ్యం. నాగార్జున గారి విషయానికి వస్తే ఆయన కంటే బెటర్ ప్రొడ్యూసర్ ఎవరు లేరు. ఆయన ఎప్పుడో చేసినవి ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. అందరూ కొత్తవాళ్లతో సీతారాముల కళ్యాణం చూతము రారండి చేశారు. అలాగే ఉయ్యాలా జంపాల కూడా. అన్నపూర్ణ స్టూడియోస్ చాలా వినూత్నమైన కార్యక్రమాలకు ఎప్పుడో శ్రీకారం చుట్టింది. కేజీ బంగారం స్కీమ్ మేమే పెట్టాం. ‘సంతోషం’ సినిమా సమయంలో రైలు లో రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగాం. ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ తో ఎవరైనా సంప్రదిస్తే ఆల్రెడీ మనం చేశాం కదా అనిపిస్తుంటుంది.

నాగార్జున గారు యాక్టర్ అవ్వడం వలన ఈ స్టూడియో నిలిచిందని భావిస్తాను. ఎంతో మందికి అన్నపూర్ణ ఇండస్ట్రీ కి హబ్ గా మారింది. ఒక విషయం చెప్పాలి.. మొన్న ఒకసారి ఇక్కడ పార్కింగ్ కి స్థలం సరిగ్గా దొరకలేదు. నాగార్జున గారు చూస్తే తిడతారేమో అని భయపడ్డా. ఆయన చూసి ‘తాత వుంటే చాలా ఆనందపడే వారు కదా’ అన్నారు. దీనికి కారణం.. ఇది ప్రారంభమైనప్పుడు తాత అమ్మమ్మ ఇక్కడ కూర్చుని..  ‘ఈ నెల కూడా ఎవరూ షూటింగ్ కి రాలేదండి’ అని అమ్మమ్మ అనేవార. ఇప్పుడిది ఇంత పెద్దగా ఎదిగిందంటే ఇందులో తాతగారు, నాగార్జున గారి కృషి వుంది.

నాగార్జున గారి 100 సినిమాకి స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారా ?
ఇది నాగార్జున గారిని అడగాలి. నేను ఏదైనా చెప్తే నాకు పడతాయి(నవ్వుతూ)

చైతు, అఖిల్ తో ప్రాజెక్ట్స్ ఉన్నాయా ?
ప్రాజెక్ట్స్ లైన్ లో వున్నాయి.

సెకండ్ ఇన్నింగ్ లో నటన స్టార్ట్ చేశారు కదా ? కొనసాగిస్తారా ?
సెకండ్ ఇన్నింగ్ కాదండీ. యాక్టింగ్ వచ్చా రాదా ? అని చెక్ చేసుకోవడానికి ‘గూఢచారి’ చేశాను (నవ్వుతూ). గూఢచారి 2 లో నా పాత్ర వుంటే చేస్తా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News