Thursday, November 14, 2024

మ్యూజిక్, ఎమోషన్స్, మెసేజ్ ఉన్న సినిమా

- Advertisement -
- Advertisement -

‘మంగళవారం’ సినిమాతో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి గునుపాటి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు అజయ్ భూపతికి చెందిన ’ఏ’ క్రియేటివ్ వర్క్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. పాయల్ రాజ్‌పుత్, ’రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా… నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత స్వాతి రెడ్డి, ఎం. సురేష్ వర్మ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

సినిమా బాగా వచ్చింది…
’మంగళవారం’ కంటే ముందు రెండు, మూడు కథలు విన్నాము. ’ఆర్‌ఎక్స్ 100’ సమయంలో అజయ్ భూపతి ’మంగళవారం’ కథ చెప్పారు. ఈ కథ ఎంతో ఆసక్తికరంగా అనిపించి ’మంగళవారం’ సినిమాను రూపొందించాము. మేం అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చింది.
కలలో కూడా ఊహించలేదు…
ముందుగా చిన్న సినిమా చేయడం మంచిదని అనుకున్నాము. కథకు ప్రాముఖ్యం ఇస్తూ టీమ్ వర్క్ ఉండేలా సినిమా చేయాలనుకున్నాము. ఇప్పుడు ‘మంగళవారం’ సినిమాకు వస్తున్న స్పందనను కలలో కూడా ఊహించలేదు.
మ్యూజిక్, ఎమోషన్స్, మెసేజ్ అన్నీ…
డార్క్ థ్రిల్లర్ జానర్ ఫిల్మ్ చేయాలని అనుకోలేదు. అజయ్ భూపతి కథ విని ఈ మూవీ చేస్తే బావుంటుందనిపించింది. సినిమాలో ఓ సందేశాన్ని చెప్పిన విధానం బాగా నచ్చింది. ఇందులో మ్యూజిక్, ఎమోషన్స్, మెసేజ్… అన్నీ ఉన్నాయి.

చాలా బాధ్యతలు చూసుకున్నారు…
ఫేస్ మాస్క్ డిజైన్ అనేది అజయ్ భూపతి ఐడియా. ‘కాంతార’కు ముందు ఈ కథ చెప్పాడు. ఆ టైంలో మాస్క్ గురించి చెప్పాడు. ఎన్నో స్కెచ్‌లు వేయించి చివరికి ఈ మాస్క్ ఓకే చేశాం. అజయ్ భూపతి దర్శకత్వం మాత్రమే కాకుండా చాలా బాధ్యతలు చూసుకున్నారు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక షూటింగ్ ప్రారంభించాము.
పాయల్ కష్టపడి చేసింది…
ఈ సినిమా హీరోయిన్ కోసం అజయ్ భూపతి గారు 40, 50 ఆడిషన్స్ చేశారు. మధ్యలో పాయల్ పేరు చర్చకు వచ్చింది. ఆమెకు లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఓకే చేశాం. పాయల్ ఎంతో కష్టపడి ఈ సినిమా చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News