Thursday, December 26, 2024

‘రాజా సాబ్‌’లో ఆ సీన్స్ ఎక్కువగా ఉంటాయి: నిర్మాత

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రాజా సాబ్‌’. హరర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ప్రడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్, గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించిన నిర్మాత ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.

రెండేళ్ల క్రితమే ఈ సినిమాను ప్రారంభించామని.. హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నట్లు టీజీ విశ్వప్రసాద్‌ తెలిపారు. ఈ మూవీలో హారర్‌ సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోషనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News