చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని అన్నారు నిర్మాత యలమంచి రవిచంద్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “2010లో పైరసీపై నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఇండస్ట్రీ అంతా నాకు సంఘీభావం ప్రకటించింది. కరోనా టైంలో అందరూ తీవ్రంగా నష్టపోయి ఉన్నప్పుడు ఇండస్ట్రీలో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అందరూ ఐకమత్యంగా కలసి ఉంటే ఇండస్ట్రీకి మంచిది. ఇక సినీ ఇండస్ట్రీని కాపాడండని ఏపి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.
సినీ పెద్దలకు నా మనవి ఏమిటంటే… ఒక సుప్రీం కమిటీని ఏర్పాటు చేయాలి. గిల్డ్, ఛాంబర్‌లు కలసి ఒక తాటిపైకి రండి. ఛాంబర్, కౌన్సిల్, మా, ఫెడరేషన్ నుంచి ఒక సుప్రీం బాడీని ఏర్పాటు చేయాలి. ఇక, ప్రకాష్ రాజ్ నిర్మాతలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి. ‘మా’ కూడా సస్పెండ్ చేసింది. అలాగే షూటింగ్‌కి టైమ్‌కి రాడు అని అతనిని సస్పెండ్ చేస్తే… ‘మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి’ అన్న వ్యక్తి మాటలు మరిచిపోయి అతనికి ఎలా మద్దతిస్తారు? అని అడుగుతున్నా. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఇండస్ట్రీ కోసం, ‘మా’ కోసం, నిర్మాతగాను తెలుగు సినీ పరిశ్రమకు సేవ చేశారు. అందువల్ల మంచు విష్ణుకు మద్దతు పలికితే బాగుంటుంది”అని అన్నారు.
Producer Yalamanchili Ravindra responds on MAA Elections