ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో 2021లో విడుదలైన ‘పుష్ప-ది రైజ్’ ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరకీ తెలిసిందే. ఇక ఆ సినిమాకు సీక్వెల్‌గా గత ఏడాది వచ్చిన ‘పుష్ప-ది రూల్’ అంతకు మించిన విజయం సాధించింది. దాదాపు 1800 కోట్ల వసూళ్లతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందని.. చివర్లో ప్రకటించారు. ‘పుష్ప-ది ర్యాంపేజ్’ పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమా విడుదల గురించి నిర్మాతలు వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘పుష్ప’ రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బ్యానర్స్‌లో నితిన్ హీరోగా ‘రాబిన్‌హుడ్’ అనే సినిమా వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడకు వెళ్లిన నిర్మాత రవిశంకర్ ‘పుష్ప-3’ రిలీజ్‌పై ప్రకటన చేశారు. ఈ సినిమా 2028లో విడుదల కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక రాబిన్‌హుడ్ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. శ్రీలీల ఇందులో హీరోయిన్. జివి ప్రకాశ్ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.