కాసిపేట:అన్ని ఏరియాలలోని అండర్ గ్రౌండ్ గనులలో ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని డైరెక్టర్ ఆపరేషన్ ఎన్‌వికె శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు జి. వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం అన్ని ఏరియాల జిఎంలో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓపెన్‌కాస్టు గనులలో వర్షాల కారణంగా ఉత్పత్తి తక్కువ మోతాదులో వస్తున్న నేపద్యంలో అండర్‌గ్రౌండ్ గనులలె ఉత్పత్తిపై దృష్టి సారించాలని వారు సూచించారు.
అందకు సంబందించిన యంత్రాల పనితీరును, ఇతర వివరాలను జనరల్ మేనేజర్లతో చర్చించారు. వర్షకాలం అయినందున ఓసిలలో ప్రోడక్షన్ తక్కువగా ఉంటుందని అందువల్ల అండర్ గ్రౌండ్ గనులలో ఉత్పత్తిని పెంపోందించాలని వారు సూచించారు. విడియో కాన్ఫరెన్స్‌లో మందమర్రి ఏరియా జిఎం జి. మోహాన్‌రెడ్డి, ఎస్‌వోటు జిఎం రాజేశ్వర్‌రెడ్డి, ఆర్‌కె ఓసి ప్రాజెక్టు ఆఫీసర్ గోవిందరావ్, ఎజెంట్ రాందాస్, ఐఈడి డిజిఎం రాజన్న, ఐటి ప్రోగ్రామర్ రవి తదితరులు పాల్గోన్నారు.