మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: స్వరాష్ట్ర సాధన కోసం ప్రోఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని అంకితం చేస్తూ ఎక్కని మెట్టులేదు.. తొక్కని గడప లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కోన్నారు. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్‌సార్ అని పేర్కోన్నారు. సార్ 12 వర్ధంతి సందర్భంగా సార్‌కు ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కీర్తించారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ఊపిరిగా తెలంగాణే ఎజెండాగా..బతుకంతా తెలంగాణగా ప్రజల ఆకాంక్షలను ఎలుగెత్తి చాటిని ఉద్యమంలో అందర్ని మమేకం చేసిన మహనీయుడని జయశంకర్‌సార్ సేవలను ప్రస్తుతించారు.
ఉద్యమాన్ని ముందుకు నడిపించిన సార్ తెలంగాణ సాకారం అయ్యే నాటికి ఆయన మనందర్ని దూరం చేసి అనంతలోకాలకు చేరుకోవడం యావత్ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేని వాస్తవం అని మంత్రి పేర్కోన్నారు. నీళ్లు, నిధులు, నియమకాలు జయశంకర్‌సార్ కల అని అది ఈ రోజున తెలంగాణ ప్రజలకు దక్కుతున్నాయని మంత్రి వెల్లడిస్తు మంత్రి జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.
నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సిఎంఆర్‌ఎఫ్ : మంత్రి
నిరుపేదల ఆరోగ్యాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా భరోసా కల్పిస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కోన్నారు. బుధవారం తన నివాసంలో రూ. 18 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను 36 మంది లబ్ధ్దిదారులకు మంత్రి చేతులమీదుగా పంపిణీ చేశారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం సిఎం సహాయ నిధి కింత చికిత్సకు తగిన ఆర్థిక తోడ్పాటు బాధితులకు అందిస్తోందని మంత్రి వివరించారు.