- Advertisement -
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలు-పంట నష్టాలు-పంటల బీమా అవసరంపై రౌండ్ టేబుల్ సమావేశంలో టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. అకాల వర్షాలతో అన్నదాత బతుకు ఆగమైందని కోదండరాం అన్నారు. తక్షణమే బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ కనీస సదుపాయాలు లేవన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు ఉచితంగా ఇవ్వాలని కోదండరాం కోరారు. త్వరగా పాత రుణాలు మాఫీ చేసి కొత్త పంట రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
- Advertisement -