- Advertisement -
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గురువారం ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్ నియమకం అయ్యారు. ఈ మేరకు రాజ్ భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయగా.. గవర్నర్ నేడు ఆమోదించారు. అటు టీఎస్ పిఎస్సి ఛైర్మన్ గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.
- Advertisement -