Monday, December 23, 2024

కాంగ్రెస్ ముందు ఆరు అంశాలను పెట్టాం: కోదండరామ్

- Advertisement -
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ జనసమితి పార్టీ కలిసి పనిచేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొ కోదండరామ్ అన్నారు. రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపామని.. కెసిఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇరుపార్టీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెజసను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, తెజస కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలు కోరారని… నవ తెలంగాణ నిర్మాణ ప్రతిపాదనకు మద్దతు తెలిపామని చెప్పారు.

తెజస తరఫున ఆరు అంశాలను కాంగ్రెస్ పార్టీ ముందుపెట్టామని తెలిపారు. నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందించాలని కోరామని.. కుటీర పరిశ్రమల ఎదుగుదలకు కృషి చేయాలని కాంగ్రెస్ ను కోరినట్లు ఆయన చెప్పారు. సాంప్రదాయ వృత్తులు, రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని… రైతుల భూములకు రక్షణ, ప్రజాస్వామ్య పాలన నెలకోల్పాలని కోరామన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ను కోరినట్లు కోదండరామ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News