Monday, January 20, 2025

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

గత కొన్నేళ్లుగా జైల్లో మగ్గుతున్న ప్రొఫెసర్ సాయిబాబాకు విముక్తి లభించింది. బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ ఆయనతోపాటు మరో ఐదుగురిని కూడా విడుదల చేయాలని మంగళవారం ఆదేశించింది. సాయిబాబాకు గతంలో విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు తోసిపుచ్చింది. వారిపై అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెనెజెస్ లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది.

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంపై 2014లో సాయిబాబాను, మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటినుంచీ సాయిబాబా నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. 2017లో సాయిబాబాతోపాటు ఒక జర్నలిస్టుతో సహా ఐదుగురికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలోని సెషన్స్ కోర్టు దోషులుగా నిర్థారించింది.

2022 అక్టోబర్ 14న హైకోర్టుకు చెందిన మరొక బెంచ్ సాయిబాబాపై అభియోగాలు చెల్లవంటూ కొట్టివేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును అదే రోజున సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు బెంచ్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా, ఏప్రిల్ 2023లో సాయిబాబా అప్పీల్ పై విచారణ చేపట్టాలని ఆదేశించింది. సాయిబాబా వయసు 54 ఏళ్లు. అంగవైకల్యం కారణంగా ఆయన చాలాకాలంగా చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News